‘వాట్సాప్’ సేవలు కొద్ది సేపు నిలిచిపోతే చాలు! చాలా మంది చెప్పలేని ఆందోళనకు గురవుతుంటారు. మెసేజ్‌లు, చాటింగ్ మొదలుకుని ఫోన్ కాల్స్‌కూ వాట్సాప్ వేదికగా మారిన నేపథ్యంలో అంతలా అడిక్ట్ అయిపోయారు. వ్యక్తిగతం కావచ్చు లేదా ఆఫీస్ పనులకు సంబంధించిన సమాచారమైనా సరే వాట్సాప్ నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయింది. చాటింగ్ మాత్రమే కాదు! వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం సైతం పంపిస్తుంటాం. ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు, ఫైళ్లు.. ఇలా విలువైన సమాచారాన్ని చేరవేస్తునపుడు వాటి భద్రత కూడా చూసుకోవాలి. అందుకే వాట్సాప్‌లో సమాచార భద్రతకు తోడు, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండేలా మీ ఫోన్‌లో ఐదు సెట్టింగ్స్ మార్చుకుంటే చాలని మీకు తెలుసా?
టు-స్టెప్ వెరిఫికేషన్ : మీ అనుమతి లేకుండా మీ నంబరుపై ఇతర ఫోన్లలో వాట్సప్‌ను క్రియేట్ చేయకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
– ఇందుకోసం Settings > Account > Two-step verification Turn on చేసుకోని 6 అంకెల పిన్‌ను సెట్ చేసుకోవాలి.
– మీ ఖాతా దుర్వినియోగం కాకుండా ఈ సెట్టింగ్ రక్షణ కల్పిస్తుంది.
– పిన్ మరిచిపోతే ఇ-మెయిల్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు.
కాంటాక్టులకు మాత్రమే : వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, ఆన్‌లైన్ యాక్టివిటీ వంటి వ్యక్తిగత సమాచారం కావాల్సిన వారికే తెలిసేలా ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Privacy లోకి వెళ్లాలి. అక్కడ మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ వంటి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి.
ఆగంతకుల కాల్స్: తెలియని నంబర్లు లేదా స్పామ్ నంబర్ల కాల్స్ రింగ్ కాకుండా ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది.Settings > Privacy > Calls లోకి వెళ్లి Silence Unknown Callers’ ఎనేబుల్ చేసుకోవాలి. కాల్స్ ట్యాబ్‌లో అలా వచ్చిన నంబర్ కాల్స్‌ను చూపిస్తుంది.
చాట్/యాప్ లాక్ : దీనితో మీ చాటింగ్, వ్యక్తిగత విషయాలు ఇతరులు చూడలేరు. కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సంభాషణలు మాత్రమే చూడకుండా చేయాలంటే చాట్ లాక్ వాడుకోవచ్చు. మీ వాట్సప్‌నే ఎవరూ యాక్సెస్ చేయకూడదూ అంటే యాప్ లాక్ చేసుకోవడం సురక్షిత మార్గం.
ఐపీ అడ్రస్ ప్రొటెక్షన్ : వాట్సప్ కాల్స్ మాట్లాడే సమయంలో మీరున్న ప్రాంతాన్ని లేదంటే ఐపీ అడ్రస్ కనుగొనకుండా చేయొచ్చు. ఇందుకుSettings > Privacy > Advanced అషవసలోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. వాట్సప్ తన సర్వర్ల ద్వారా కాల్స్‌ను రూట్ చేస్తుంది. కాల్ క్వాలిటీలో చిన్నపాటి తేడా రావొచ్చు.
ఈ ఫీచర్ వాడుకుంటున్నారా..?
- Advertisement -
- Advertisement -



