Sunday, August 2, 2026
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

మతిమరుపు
ప్రొఫెసర్‌ తన భార్యతో-
‘నాకు మతి మరుపు అని అంటుంటావుగా… ఈ రోజు నేనేం చేశానో చూడు’ అన్నాడు.
‘ఏం చేశారు?’ ఆసక్తిగా అడిగింది భార్య.
‘బజారుకు వెళ్లేటప్పుడు తోడుగా తీసుకెళ్లిన మన చంటిగాడిని మరచిపోకుండా తిరిగి ఇంటికి తీసుకొచ్చాను’ అన్నాడు ప్రొఫెసర్‌ గర్వంగా.
‘మీ మతిమరుపు మాడా.. అసలు మనకు పిల్లలే లేరు కదండీ…’ అంటూ విరుచుపడింది భార్య.
మేకప్‌ మహిమ
‘వెల్డన్‌ మేడమ్‌! మా మందు మీకు బాగా పనిచేసింది. మీరు రెండు కిలోలు తగ్గారు’ అన్నాడు రిప్రజెంటేటివ్‌.
‘నీ మొహం!. ఈ రోజు నేను మేకప్‌ చేయలేదు’ అంది సుందరి.
ఉచిత సలహా
అరవై ఏళ్ల వ్యక్తి మ్యారేజ్‌ బ్యూరోకు వెళ్లాడు.
‘నేనో విధవను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు.
‘అలాంటి సంబంధం దొరకడం ఇప్పటికిప్పుడు కష్టం. ముందైతే మీరు పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని కట్టుకున్న ఆవిడ కొన్ని రోజులకే ఆటోమెటిక్‌గా విధవ అయిపోతుంది లేండి’ సలహా ఇచ్చాడు ఏజెంట్‌.
చురుకైన వాడు
రామయ్య : మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు?
సోమయ్య : కలెక్టర్‌
రామయ్య : రెండో వాడు?
సోమయ్య : పోలీసాఫీసర్‌
రామయ్య : మూడో వాడు?
సోమయ్య : దొంగతనాలు
రామయ్య : ఇద్దరు అన్నయ్యలు గౌరవప్రదమైన వృత్తుల్లో ఉండగా చిన్నోడు దొంగతనాలు చేయడమేమిటి?’
సోమయ్య : వాడు దొంగతనాలు చేయబట్టే ఆ డబ్బుతో పెద్దోళ్లిద్దరు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోగలిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -