Sunday, August 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రశ్నించడమే ప్రజాస్వామ్యం

ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం

- Advertisement -

ప్రమాదంలో రాజ్యాంగం, పత్రికాస్వేచ్ఛ అక్షరయోధులు సామాన్యుల పక్షానే ఉండాలి
కమ్యూనిజం అజరామరం
నిత్యనూతనోత్తేజ నినాదం నవతెలంగాణ అదెప్పుడూ కష్టం, కన్నీటి పక్షమే
‘బొద్దింకల దండయాత్ర’ స్ఫూర్తివంతం
‘దైవాంశసంభూతుల’ మెడలు వంచారు
నవతెలంగాణ 11వ వార్షికోత్సవ వేడుకల్లో నేతల కీలకోపన్యాసాలు

‘‘పత్రికలు ప్రజల పక్షాన నిలిచి పాలకుల తప్పుల్ని ఎత్తిచూపుతూ ‘ప్రశ్న’ను కొనసాగిస్తేనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పత్రికాస్వేచ్ఛ మనుగడలో ఉంటాయి. కానీ దాన్ని నియంత్రించేందుకు పాలకులు ఎప్పుడూ తప్పుడు మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. అలాంటి నిర్భంధాలను తట్టుకొని నిలబడటమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. ‘నవతెలంగాణ’ అక్షరయోధులు అలాంటి స్ఫూర్తివంతులు. వారెప్పుడూ సామాన్యుల పక్షాన అణగారిన వర్గాలకు గొంతుకై నిలుస్తారు’’ అని పలు రాజకీయపార్టీల నేతలు వ్యాఖ్యానించారు. ‘నవతెలంగాణ’ 11వ వార్షికోత్సవ వేడుకలు శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో చైతన్య స్ఫూర్తితో జరిగాయి. పత్రిక చీఫ్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ ‌పీ ప్రభాకర్‌ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్యం-రాజ్యాంగం-పత్రికా స్వేచ్ఛ’ అంశంపై సదస్సు జరిగింది. పీసీసీ అధ్యక్షులు మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, సీపీఎం, సీపీఐ రాష్ర్ట కార్యదర్శులు జాన్‌‌వెస్లీ, కూనంనేని సాంబశివరావు, నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ‌వైఫల్యాలను ఎండగట్టారు. వ్యవస్థల నిర్వీర్యాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్‌ ‌మీడియా పాలకులకు అమ్ముడుపోతే, ప్రత్యామ్నాయ మీడియా ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేస్తుందో ‌చెప్తూ ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘బొద్దింకల దండయాత్ర’ రైతాంగ పోరాటాలను ప్రస్తావించారు. భవిష్యత్‌ ‌రాజకీయాల్ని శాసించేది ‘జెన్‌ ‌జీ’నే అని స్పష్టంచేశారు. కమ్యూనిజం అజరామరం అని కీర్తించారు. భవిష్యత్‌‌లో అదే దేశానికి దిక్సూచి అని తేల్చిచెప్పారు.

అనుదినం..జ‌న‌స్వ‌రం
ఇదే మా నినాదం : ​పి.ప్రభాకర్ సీజీఎం
అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే మీడియాను అణగదొక్కుతున్నారు. అరెస్టులు, కేసులు, జైళ్లు, నిర్బంధాలు, మీడియా సంస్థలపై దాడులు కొన‌సాగున్నాయి. ఆయా సంస్థలు మూతపడే వరకు తెస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. న్యూస్ క్లిక్ అనే ఆన్ లైన్ పోర్టల్ ఢిల్లీలో సుదీర్ఘకాలం జరిగిన రైతాంగ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడింది. అందులో పని చేస్తున్న విలేకరులపై కేసులు పెట్టి బెదిరించి, ప్ర‌భీర్ పుర‌కాయ‌స్త అనే సీనియర్ జర్నలిస్ట్, సంపాదకుడిని అరెస్ట్ చేసి వేధించారు.

కర్తవ్యాలకు పునరంకితం
రాంపల్లి రమేశ్, నవతెలంగాణ ఎడిటర్
నవతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా సిబ్బంది, విలేకరులు కర్తవ్యాలకు మరోసారి పునరంకితం కావాలి. రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ అనేది వేర్వేరు కాదు. ఆ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా మిగితావి నిలబడజాలవు. కానీ, నేడు అవి మూడు ప్రమాదంలో ఉన్నాయి. అలాంటి సందర్భంలో వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ వాటిని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. సామాజిక చైతన్యాన్ని సంఘటితం చేయడమే లక్ష్యంగా పని చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -