- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.
- Advertisement -


