Monday, August 3, 2026
E-PAPER
Homeజాతీయంప్రియుడి కోసం..6 నెలల కొడుకుని చంపిన కసాయి తల్లి

ప్రియుడి కోసం..6 నెలల కొడుకుని చంపిన కసాయి తల్లి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విశాల్‌తో ప్రేమలో పడిన షబ్నమ్ అనే వివాహిత, తన ఆరు నెలల కుమారుడు సమీర్‌తో కలిసి అతని వద్దకు వెళ్లింది. అయితే చిన్నారిని అంగీకరించబోనని విశాల్ చెప్పడంతో, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన షబ్నమ్ అతడిని హత్య చేయడానికి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం విశాల్‌తో కలిసి చిన్నారిని సమీప డ్రైనేజీలో ముంచి హత్య చేశారు. కుమారుడు కనిపించడం లేదని భర్త ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు షబ్నమ్, విశాల్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -