రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలు అపహరణ
అత్తాపూర్ పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వ్యాపారి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్ బాబానగర్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌ఖాన్ అదే ప్రాంతంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి అతను ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతోపాటు ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారాలోని రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఫిరోజ్‌ఖాన్ వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వ్యాపారి ఇంట్లో చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



