- సుప్రీంకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్: సహాజీవనంలోనూ గృహాహింస కేసు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. పెళ్లయిన మహిళలకు రక్షణ కల్పించే సెక్షన్ 498ఏ.. సహజీవనంలో ఉన్న స్త్రీలకు అప్లై అవుతుందని పేర్కొంది. అయితే ఆ సదరు మహిళ తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. సహజీవనంలో (లివ్-ఇన్ రిలేషన్షిప్) ఉండే మహిళలకు సైతం వివాహితల మాదిరిగానే భర్త లేదా భాగస్వామి వేధింపులపై రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహహింస చట్టం కేవలం గృహహింస నిరోధాకానికి మాత్రమే కాకుండా, క్రిమినల్ చట్టాలు ఇటువంటి బాధితులకు రక్షణ కల్పిస్తాయని కోర్టు తెలిపింది. అయితే దీనికి తప్పనిసరిగా ఇద్దరు పరస్పర వివాహ అంగీకారంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.



