Wednesday, March 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజాబ్‌క్యాలెండర్‌ ఇంకెప్పుడు?

జాబ్‌క్యాలెండర్‌ ఇంకెప్పుడు?

- Advertisement -

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హమీనిచ్చింది. ఇప్పుడు గద్దెనెక్కి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నిరుద్యోగ యువతకు జాబ్‌ క్యాలెండర్‌ మాత్రం ప్రకటించడం లేదు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తుందే తప్ప ఉద్యోగ నోటిఫికేషన్‌ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ వేస్తుందనే ఆశతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి అధిక డబ్బులు వెచ్చించి హైదరాబాద్‌ హాస్టళ్లలో ఉంటూ కోచింగ్‌లకు వెళ్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ, సర్కార్‌ మాత్రం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి వేసారిన కొంతమంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్‌ల కోసం పోరాడుతున్నారు. వారిపైన కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు.ఇది ప్రభుత్వానికి మంచిపద్ధతి కాదు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నారే తప్ప, ఇవి గొంతెమ్మ గోర్కెలు కాదని పాలకులు గుర్తించాలి. అసెంబ్లీ అంటేనే గౌరవ ప్రధానమైన సమావేశ మందిరం, అలాంటిది బాధ్యతారహితంగా స్వయానా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లకు నియామక పత్రాలిచ్చిన ప్రస్తుత సర్కార్‌ డెభ్బై వేల ఉద్యోగాలిచ్చినట్టు చెబుతున్నారు.ఇప్పటికైనా అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నిరుద్యోగ యువతను ఆదుకోవాలి.అలాగే నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న నెలకు రూ.మూడు వేలు వెంటనే అమలు చేయాలి.లేదంటే నిరుద్యోగులను విస్మరించిన గత సర్కార్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పడుతుంది.
– మిద్దె సురేష్‌, నాగర్‌కర్నూల్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -