Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు..అసలేం జరిగింది?

యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు..అసలేం జరిగింది?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను కొన్ని దేశాల్లో తాత్కాలికంగా తొలగించింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు గుర్తించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. అయితే, టెలిగ్రామ్ వెంటనే స్పందించి ఆ కంటెంట్‌ను తొలగించడంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించింది.

సోమవారం పలు దేశాల్లోని ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు యాప్ స్టోర్లో టెలిగ్రామ్ కోసం వెతకగా అది కనిపించలేదు. అయితే, ఈ తొలగింపు ప్రభావం భారత్‌పై పడలేదు. భారత యూజర్లు యథావిధిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో, మ్యాక్ యాప్ స్టోర్‌లో కూడా టెలిగ్రామ్ అందుబాటులోనే ఉంది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు సేవల్లో ఎలాంటి అంతరాయం కలగలేదు.

ఈ విషయంపై బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ యాపిల్ ప్రకటనను షేర్ చేశారు. తమ కఠిన నిబంధనలను ఉల్లంఘించే చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ ఉన్నందున టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా తొలగించామని యాపిల్ పేర్కొంది. డెవలపర్ ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించి, పోస్ట్ చేసిన యూజర్‌ను బ్యాన్ చేయడంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించామని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -