Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుత్రిషపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్‌

త్రిషపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే ఆయన్ను అరెస్ట్‌ చేశారు. చెన్నైలో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణకు వచ్చేలోపే ఆయన్ను అరెస్ట్‌ చేయడం గమనార్హం. కావేరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉదయనిధి నిన్న ప్రసంగించారు. ఆ సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి నటి త్రిష పేరు ప్రస్తావించగా, దానికి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంతో ఉన్నాయని విమర్శలు వచ్చాయి. మహిళలను అవమానించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -