Tuesday, August 4, 2026
E-PAPER
Homeజాతీయంఈ-20 పెట్రోల్‌ నాణ్యతపై కేంద్రం కీలక ప్రకటన

ఈ-20 పెట్రోల్‌ నాణ్యతపై కేంద్రం కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఈ20 పెట్రోల్‌ నాణ్యత (E20 Petrol Quality) పై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మంగళవారం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్‌ సంస్థలు (OMC) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 87 వేలకుపైగా పెట్రోల్‌ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కలుషిత/కల్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రతి ట్యాంకర్‌ను స్వీకరించే ముందు పైభాగం, దిగువ భాగం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ప్రతి డెలివరీకి ముందు కూడా నాణ్యత తనిఖీలు తప్పనిసరిగా చేస్తున్నట్లు పేర్కొన్న‌ది. 2024 జూలై నుంచి 2026 జూన్‌ వరకు నాణ్యత ప్రమాణాలు పాటించని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్‌ ఉన్నట్లు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -