Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలు సేవించే వారిని పటిస్తే రూ.1 లక్ష బహుమతి

మాదకద్రవ్యాలు సేవించే వారిని పటిస్తే రూ.1 లక్ష బహుమతి

- Advertisement -

ఈ ఎల్ వి  భాస్కర్ ఫౌండేషన్
నవతెలంగాణ – చండూర్
మాదక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి రూ. 1లక్ష నగదు బహుమతి అందజేస్తామని ఈ ఎల్వి  భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈఎల్వి ఫౌండేషన్ సహకారంతో చండూరు వాలంటరీ టీం సభ్యుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల గురించి చండూరు మున్సిపల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ అవగాహన సదస్సుకు చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం, ఎస్సై శివకుమార్ హాజరై మాట్లాడుతూ.. చిన్న వయసులో విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి చదువు మధ్యలోనే నిలిపివేసి వ్యసనాలకు బానిసవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడుతూ వారి జీవితాలలో ఆగం చేసుకుంటున్నారని అన్నారు. యువతను పెడతోవా పట్టించే మాదక ద్రవాలను విక్రయించిన, వాటిని సేవించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలను విక్రయించిన వారిని, సేవించిన వారిని పట్టిస్తే వారికి రూ. 1లక్ష నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఈ ఎల్ వి  భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -