Tuesday, August 4, 2026
E-PAPER
Homeజిల్లాలుభూ రీ -సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ 

భూ రీ -సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని బట్లపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పరిశీలించారు. గ్రామ శివారు భూములు, గ్రామ కంఠం భూములు, ప్రభుత్వ భూములు, రైతుల పట్టా భూములు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూముల సర్వే పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భూ రీ- సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక శాటిలైట్ రోవర్ సాంకేతికతతో గ్రామంలోని ప్రతి భూమిని అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో రీ-సర్వే చేస్తున్నామని రైతులకు వివరించారు.

సర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూమికి ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్ నంబర్ (ఎల్ పి ఎన్) కేటాయించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 90 సంవత్సరాల తర్వాత ఇంత భారీ స్థాయిలో భూముల రీ-సర్వే చేపడుతున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని రైతులందరూ సర్వేను ఒక పండుగలా భావించి ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రైతులు తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలు, ఆధారాలతో సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రతి రైతు స్వయంగా సర్వే సమయంలో పాల్గొంటే భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని తెలిపారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా 86, 87సర్వే నంబర్ల పరిధిలోని రైతుల పట్టా భూములకు సంబంధించిన సమస్యలను స్వయంగా కలెక్టరే పరిశీలించి, అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ల్యాండ్ సర్వే ఏడి దేవరాజ్, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జిసి మున్నయ్య, మండల సర్వేయర్ స్వప్న, ఉప సర్పంచ్ వెంకటేష్, సంబంధిత అధికారులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -