Tuesday, August 4, 2026
E-PAPER
Homeజిల్లాలునిండుకుండలా కౌలాస్ నాళా ప్రాజెక్టు

నిండుకుండలా కౌలాస్ నాళా ప్రాజెక్టు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరిందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా.. ప్రస్తుతము 456. 20 మీటర్లు నీరు ఉందని చెప్పారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర , కర్ణాటక ప్రాంతాలలో నిరంతరంగా వర్షం పడుతుండడంతో మంగళవారం ఉదయం ఆరు గంటల సమయానికి 555 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని, అవుట్ ఫ్లో నిల్ ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రాజుక్టు నిండుకుండలా మారిందని తెలిపారు. మరోవైపు మండల పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో చెరువులు, కుంటలు నిండుకుంటున్నాయని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -