Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షానికి జలమయమైన రోడ్లు

భారీ వర్షానికి జలమయమైన రోడ్లు

- Advertisement -

గుంతల మయంగా రోడ్డు 
నవతెలంగాణ-ఆలేరు టౌను 

ఆలేరు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి నిర్విరామంగా గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు వరదలా పారుతోంది. రైల్వే గేట్ అండర్ పాస్ జలమయంగా మారి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెయిన్ రోడ్డు నుండి కులంపాక రోడ్డు వైపు వెళ్లే వాహనాల ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి.

భారీ వాహనాలు రోడ్డు పక్కన ఆగితే చాలు దిగబడే పరిస్థితి నెలకొంది. మహాలక్ష్మి వైన్స్, శ్రీనివాస ఫర్నిచర్, అపోలో ఫార్మసీ, జై భవాని కిరాణం, పరమేశ్వర కిరాణం జనరల్ స్టోర్, జై వైష్ణవి మెడికల్ జనరల్ స్టోర్ ,మనీ మొబైల్ సిరి ఎలక్ట్రానిక్స్, బాలాజీ ఆప్టికల్స్, రాఘవేంద్ర మొబైల్స్, శ్రీ విజయ హాస్పిటల్ వరకు మెయిన్ రోడ్డుకు పక్కన గుంతలు అధికంగా ఉన్నాయి. దీంతో వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. ఫ్యాన్సీ ఫుట్వేర్, కూరగాయల షాప్ వద్ద, మెయిన్ రోడ్డు ఇరువైపుల పలుచోట్ల, బస్టాండ్ నుండి బస్సులు బయటకు వెళ్లే దారిలో గుంతలు పడడంతో వర్షపు నీరు నిలిచి పాదచారులు కూడా నడవలేని పరిస్థితి దాపురించింది. చినుకుపడితే రోడ్డు చిత్తడిమయమైపోతోంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -