నవతెలంగాణ-బాల్కొండ
విద్యార్థులు లక్ష్యసాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాల్కొండ సర్పంచ్ గండ రాజేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ గాండ్ల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాలకు తన వంతు కృషి ఎల్లవేళలా ఏర్పాటు చేస్తానని అన్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో జరిగిన ఎన్నికలలో ఎన్నికైన హెడ్ బాయ్ , హెడ్ గర్ల్ లను ప్రశంసించి సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయ బృందం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని రాబోయే రోజులు మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం విద్యార్థులు పాటలు ముత్యాలతో సందడి చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణేష్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.



