Wednesday, August 5, 2026
E-PAPER
Homeమానవిచిటపట చినుకుల్లో….

చిటపట చినుకుల్లో….

- Advertisement -

మాయిశ్చరైజర్‌: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి. ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు లేదా మార్కెట్‌లో లభించే సురక్షితమైన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులు చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి. వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశం ఉంది. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో హెవీ మేకప్‌ కాకుండా, తేలికపాటి, వాటర్‌ ప్రూఫ్‌ లైట్‌ మేకప్‌ ఎంచుకోవాలి. ఫౌండేషన్, కన్సీలర్‌ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్‌. ఈ సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ, సన్‌స్క్రీన్ ఉపయోగించడం ముఖ్యం. ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పండ్లు, కూరగాయలు, ఇతర పోషకమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -