Saturday, August 1, 2026
E-PAPER
Homeమానవినేస్తమంటే తనే…

నేస్తమంటే తనే…

- Advertisement -

నా పేరు డా. ప్రత్యూష. నాన్న డా.తిరుపాలు, అమ్మ నెరేళ్ల లక్ష్మీ. మా సొంతూరు నెల్లూరు. నాకున్న మంచి స్నేహితురాలు డా.చాందిని టగ్నెట్. తను గురగ్రామ్‌లో ఉంటుంది. తను నాకు ఐదేండ్లుగా స్నేహితురాలు. అనుకోకుండా ఒక కాన్ఫరెన్స్‌‌లో కలిశాం. అప్పటి నుండి మా స్నేహం కొనసాగు తోంది. ఎంత మంది స్నేహితులు ఉన్నా, తన స్నేహం ఏంతో ప్రత్యేకం. రక్త సంబంధతో ముడి పడనిది స్నేహ బంధం. ఎటు వంటి ఆంక్షలు, హద్దులు, పరిమితులు లేనిదే స్నేహం. ఏదైనా పంచుకోవడానికి నాకంటూ ఒకరు ఉన్నారని అనుకుంటాను. నాకు తాను ఐకానిక్‌ స్నేహితురాలు. ఎందుకంటే ఏదైనా సరే తనతో పంచుకోగలను. ఏ విషయం అయినా సరే తనతో స్వేచ్ఛగా చెప్పగలను. మనం చెప్పేది వాళ్ళు అర్ధం చేసుకుని, జడ్జ్ చేయకుండా స్వాంతన పొందేలా ఉండాలి. ముందు నమ్మకం అనేది ఉండాలి. అది చాలా ముఖ్యం. అలాంటి నమ్మకం నాకు చాందిని ఇచ్చింది. తన మనసులో నాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తను కూడా ఎవరితోనూ పెద్దగా షేర్ చేసుకోదు. ఏదున్నా నాతోనే పంచుకుంటుంది. మేమిద్దరం జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు చూసాం. వాటిని అధిగమించాం. మేమిద్దరం దగ్గరలో లేక పోయినా మానసికంగా తాను ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా అండగా నిలబడుతుంది. ఎటువంటి ఈర్ష్య, ద్వేషాలకు తావు లేకుండా ఉంటాము. మాది ఒక అద్భుతమైన స్నేహం. నా దృష్టిలో స్నేహం చిన్న విషయం కాదు. ఎంత పెద్ద విషయాన్నై‌నా చిన్నగా మార్చే అద్భుత సాధనం. ఎలా కలిసామో తెలియలేదు. ఎందుకు మనం కలిసామో తెలియదు. కానీ నువ్వు కలిసాకే తెలిసింది, స్నేహం ఎంత గొప్పదో అని. ఐలవ్యు చాందిని.
డా.ప్రత్యూష, జనరల్ ఫిజీషియన్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -