Wednesday, March 25, 2026
E-PAPER
Homeఆటలురింకూ సింగ్ కు కేకేఆర్ ప్రమోషన్

రింకూ సింగ్ కు కేకేఆర్ ప్రమోషన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ అయిన రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. రాబోయే సీజన్‌లో వెటరన్ ఓపెనర్ అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, అతనికి డిప్యూటీగా రింకూ బాధ్యతలు చేపట్టనున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టులో ముఖ్య ఆటగాడిగా మారిన రింకూకు, దేశవాళీ క్రికెట్‌లో నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. ఈ నియామకంపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ, “ఫ్రాంచైజీ తరఫున, రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. రింకూ 2018లో కేకేఆర్‌లో చేరాడు. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతూ తనను తాను నిరూపించుకున్నాడు” అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -