తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీలపై ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిడియం బాబూరావు, పూసం సచిన్ ప్రకటన విడుదల చేశారు. అడవిలో చేపలవేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయ పర్చిన ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూముల నుండి మొక్కలు నాటడం, రీ సర్వే పేరుతో ములుగు, భద్రాద్రి, జిల్లా లో ఆదివాసీలపై దాడులు చేయటం దారుణమని పేర్కొన్నారు. జన్నారం రేంజ్ పరిధిలో చేపల వేటకు వాగు దగ్గర ఉన్న ఆదివాసీ యువకులపై ఫారెస్టు అధికారులు అత్యంత హేయంగా వ్యవహరించారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ఆదివాసీలకు అండగా ఉంటామని చెప్పి,ఇప్పుడు వారిపైనే దాడులు చేయటం సరికాదని విమర్శించారు. ఒకవైపు ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం… మరో వైపు ఫారెస్ట్ అధికారులతో ఆపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రం లోని బీజేపీ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదనీ, రెండు ప్రభుత్వాలు ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు.
ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



