అలుగుపారిన చెరువులు పొంగిపొర్లిన పోచారం
నిజాంసాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు అలుగుపారగా.. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లింది. నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటు 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాన్సువాడ, నిజాంసాగర్, మహ్మద్‌నగర్, కామారెడ్డి, గాంధారి, రామారెడ్డి మండలాల్లో 100 మి. మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ సమయానికి సాధారణ వర్షపాతం 422.5 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. ఇటీవల కురిసిన వర్షాలతో ఏకంగా 570 మి.మీటర్లకు చేరి 30 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో సాగుకు ఢోకా లేద ని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో నాలుగు మండలాల్లో అతిభారీ వర్షపాతం నమోదు కాగా, 13 మండలాల్లో భారీ, 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నిజా మాబాద్ జిల్లాలో మాత్రం 18.9 మి.మీ వర్షపాతమే కురిసింది. కాగా, వర్షాలతో పంట లు నీట మునిగాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
శ్రీరాంసాగర్‌లోకి పెరిగిన ఇన్‌ఫ్లో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాజెక్టులోకి 22,222 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 34.817 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ఈ సీజన్‌లో తొలిసారి 7789 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1464 ఎంసీఎఫ్‌టీ (1.820 టీఎంసీలు) కాగా అంతేస్థాయిలో నిండటంతో ప్రాజెక్టు మీదుగా.. 8292 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తున్నట్టు ఇరిగేషన్ డీఈఈ కిష్టయ్య తెలిపారు.
కామారెడ్డిలో అర్ధరాత్రి భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



