ములుగు జిల్లాలో మంత్రి సీతక్క విస్తృత పర్యటన .. పనులను పరిశీలన
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనం ప్రారంభం
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లాలో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఆలయ పరిసర ప్రాంగణం లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం వనదేవ తలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ చివరిదశ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాల ని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క భవన్‌లో మదర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణా శిబిరంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధితోనే ఆర్థిక అభివృద్ధి సాధించాలని, ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలో సమగ్ర శిక్షణ ఆధ్వ ర్యంలో 2కోట్ల 30లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యం నూతన భవనం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాల భవనాలను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగా లని సూచించారు. ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని అన్నారు. గొప్ప చదువులు చదివి సమాజానికి ఉపయో గపడే పనులు చేయాలని ఆకాంక్షిం చారు. రానున్న పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థా యిలోనే విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సూచించారు.
రోడ్డు మీద అమ్ముతున్న మహిళ వద్ద పుట్టుగొడుగులు కొన్న మంత్రి
మేడారం పర్యటన ముగించుకుని ఏటూరునాగారం వైపు వెళ్తున్న మంత్రి సీతక్క మార్గమధ్యలో ఆదివాసీ మహిళ పుట్టగొడుగులు విక్రయిస్తుండటాన్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. అడవిలో సేకరించిన పుట్టగొడుగులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఆమెతో మంత్రి సీతక్క కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టగొడుగుల విక్రయాల గురించి, వాటి ద్వారా లభిస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టగొడుగులను కొనుగోలు చేసి ఆమెకు అండగా నిలిచారు. అంతకుముందు పాలం పేటలోని రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్ పథకం రూ.61.99 కోట్ల వ్యయంతో చేపడు తున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరి శీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువు లోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, డీఈ నటరాజ్, ఏఈ విజయ్, ఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఈ అరుణ్ కుమార్, ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఉన్నారు.
మేడారం చివరిదశ అభివృద్ధి పనుల వేగం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



