వాషింగ్టన్ : ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి దానిని శిక్షించేందుకు సృజనాత్మకమైన, సంప్రదాయేతర కొత్త మార్గాలను సూచించాలని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) సైనిక విశ్లేషకులను కోరింది. ఈ మేరకు సెంట్‌కామ్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారి ఒకరు సైనిక విశ్లేషకులకు ఈ – మెయిల్స్ పంపారని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలియజేసింది. ఈ – మెయిల్ ద్వారా క్రౌడ్‌సోర్సింగ్ తరహాలో ప్రశ్నలు వేయడం ఓ అసాధారణ చర్య అని అధికారులు వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తేవడానికి ట్రంప్‌కు పరిమితమైన అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక సూచిక అని చెప్పారు. సెంట్రల్ కమాండ్ అన్ని విషయాలనూ పరిశీలిస్తోందని, వ్యూహాన్ని పున్ణపరిశీలించాల్సిన అవసరం ఉన్నదని అది అంగీకరిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వినూత్న మార్గాలలో ఆలోచించడం, పనిచేయడంలో సెంట్రల్ కమాండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉన్నదని సెంట్‌కామ్ ప్రతినిధి కెప్టెన్ తిమోతి హాకిన్స్ చెప్పారు. సాధ్యమైనంత వరకూ అత్యున్నత స్థాయి కార్యాచరణ పనితీరును కనబరచడం కోసం బృందంలోని సభ్యులను వారి హోదాలతో సంబంధం లేకుండా సంప్రదిస్తామని ఆయన తెలిపారు.
సైనిక విశ్లేషకులను కోరిన సెంట్‌కామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



