- Advertisement -
హైదరాబాద్: భారత ఔషధ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో బలోపేతం చేయడంలో, రోగి-కేంద్రిత ఆరోగ్య పరిష్కారాలను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకు హైదరాబాద్‌కు చెందిన ఎకోబ్లిస్ ఇండియా సిఎండి చక్రవర్తి ఏవీపీఎస్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సింగపూర్‌లోని పాన్ పసిఫిక్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ‘సీఎంఓ ఏషియా బిజినెస్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్’ వేదికగా ‘ఏషియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ – ఇండియన్ ఫార్మా’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఫార్మా సామర్థ్యాన్ని చాటడం, బాధ్యతాయుతమైన ఔషధ ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంలో చూపిన నాయకత్వానికి ఈ అవార్డు దక్కిందని చక్రవర్తి తెలిపారు.
- Advertisement -



