Wednesday, August 5, 2026
E-PAPER
Homeజాతీయంభారత్ ప్రభుత్వానికి మెటా సీఈవో క్షమాపణ

భారత్ ప్రభుత్వానికి మెటా సీఈవో క్షమాపణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ ప్రభుత్వానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాలల లైంగిక వేధింపుల సామగ్రి (CSAM), డీప్‌ఫేక్‌లు, అల్గారిథమిక్ పాలనలో జరిగిన తీవ్రమైన లోపాలపై జుకర్‌బర్గ్ అధికారికంగా క్షమాపణలు చెప్పి.. విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఆ సంస్థ అంగీకరించింది.

ఇటీవల ప్రధాని మోడీ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే ‘జెన్-జీ అవుట్‌రీచ్’ వీడియోను మెటా తొలగించింది. అయితే సాంకేతిక కారణాలతో డిలీట్ అయిందని వివరణ ఇచ్చింది. అయితే మెటా వివరణపై పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పక పోతే.. మెటాకు చట్టపరమైన రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం. కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో మొత్తానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ దిగొచ్చి కేంద్రానికి క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రత్యేకంగా ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పినట్లుగా కనిపించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -