- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ గురువారం విడుదలైంది. ఇందులో నాని ‘జడల్’ పాత్రలో కనిపించనున్నారు. మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని సెప్టెంబరు 24న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
- Advertisement -



