Thursday, March 26, 2026
E-PAPER
Homeనల్లగొండస‌ఖి సెంట‌ర్‌ను సంద‌ర్శించిన‌ కలెక్టర్

స‌ఖి సెంట‌ర్‌ను సంద‌ర్శించిన‌ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి: జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. గురువారం హౌసింగ్ బోర్డ్‌లో గల సఖీ సెంటర్‌ను కలెక్టర్ సందర్శించారు. సఖీ సెంటర్ లో ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో అందిస్తున్న సేవలను పరిశీలించి, బాధిత మహిళలకు అందుతున్న సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖీ సెంటర్ కి ఎలాంటి కేసులువస్తున్నాయని, వచ్చిన కేసులకు ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సఖి సెంటర్ కీలక పాత్ర పోషించాలన్నారు. సఖి సెంటర్‌లో మహిళలకు అందిస్తున్న కౌన్సెలింగ్, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించే విధంగా సిబ్బంది పనిచేయాలని అన్నారు.

అనంతరం మాస్కుంట నిర్మాణంలో ఉన్న సఖి భవనాన్ని కలెక్టర్ సందర్శించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. తర్వాత సింగన్న గూడెంలో నిర్మాణంలో ఉన్న బాల సదనం భవనాన్ని సందర్శించి. పెండింగ్ పనుల అతి త్వరగా పూర్తిచేయించాలని డీఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు
సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ స‌ఖి సెంట‌ర్ సంద‌ర్శ‌న‌

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -