Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతొలి భారతీయ సినిమాగా రికార్డ్‌

తొలి భారతీయ సినిమాగా రికార్డ్‌

- Advertisement -

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’. ఈ సినిమా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు అరుదైన ఘనత కూడా సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ వీఎఫ్‌ఎక్స్‌, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భారతదేశపు గొప్ప ఇతిహాసాన్ని అత్యంత గౌరవంతో, ప్రామాణికంగా, భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ట్రైలర్‌లో మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, యష్కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపావళి కానుకగా సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా, ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -