పిల్లలు ఆడుకునే సాఫ్ట్ టాయ్స్‌ను నీటితో ఉతికితే వాటి మెత్తదనం తగ్గి, రంగు వెలిసిపోతుంది. వీటిని డ్రై క్లీన్ చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిలో బొమ్మను ఉంచి, అందులో ఒకటి రెండు కప్పుల బియ్యం వేసి గట్టిగా కట్టాలి. కొద్దిసేపు ఆ సంచిని మెల్లగా ఊపడం వల్ల బొమ్మపై ఉండే దుమ్ము, మురికిని బియ్యం పీల్చుకుంటాయి. తర్వాత బొమ్మను బయటకు తీసి మెత్తటి బ్రష్‌తో దులిపితే సరిపోతుంది.
ఉప్పు తడవకుండా..
తేమ వల్ల ఉప్పు డబ్బాలో ముద్దలుగా మారడం సహజం. దీన్ని నివారించడానికి ఉప్పు డబ్బాలో కొన్ని బియ్యపు గింజలను వేసి ఉంచాలి. ఇవి గాలిలోని అధిక తేమను పీల్చుకుని, ఉప్పు ఎప్పుడూ పొడిగా, విడివిడిగా ఉండేలా చూస్తాయి.
వాసనలు మాయం..
మిక్సీ లేదా కాఫీ గ్రైండర్ బ్లేడ్లకు పట్టిన జిడ్డును తొలగించడానికి ఒక కప్పు బియ్యాన్ని అందులో వేసి అర నిమిషం పాటు గ్రైండ్ చేయాలి. దీనివల్ల బ్లేడ్లపై ఉన్న జిడ్డు, బ్యాడ్ స్మెల్ మాయమవుతాయి. అనంతరం నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
మొక్కలకు
బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా మొక్కల మొదళ్లలో పోయడం వల్ల అందులోని పిండిపదార్థాలు, పోషకాలు నేల సారవంతాన్ని పెంచి మొక్కలు బలంగా పెరిగేందుకు దోహదపడతాయి. అయితే ఈ నీటిలో ఉప్పు లేదా నూనె కలవకుండా జాగ్రత్తపడాలి.
బియ్యంతో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



