విజయవాడ : జాతీయ స్థాయిలో నాణ్యమైన వాలీబాల్ క్రీడాకారులను తయారు చేసేందుకు పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్, అండర్-21 ఆటగాళ్ల సెలక్షన్స్‌తో పీవీఎల్ ప్రాంఛైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ముందుకొచ్చింది. గురువారం విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో నిర్వహించిన ట్రయల్స్‌కు అండర్-21 విభాగంలో 105 మంది, పీవీఎల్ ఓపెన్ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 17న గోవాలో జరిగే ఆటగాళ్ల వేలం జాబితాలో చేర్చనున్నారు. పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్ ప్రారంభోత్సవానికి ఏపీ క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు , కెఎస్‌జి వ్యవస్థాపకుడు, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి కంకణాల, వాలీబాల్ క్రీడాకారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాలీబాల్ అభివృద్ధికి బ్లాక్‌హాక్స్ ప్రణాళిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



