బండ్రు బడుగుల బతుకుల కోసం
దూమ్ దామ్ అంటూ డప్పు మోగించి,
విప్లవ మాటలు పాటలుగా మార్చి,
ప్రజల గుండెల్లో జ్వాలలు రాజేసిన
విమలక్క నీకు లాల్ సలాం!
లాల్ సలాం… నిల్ సలాం…
అంటూ అడుగులు వేస్తూ,
అరుణోదయ అమరుల గీతాలకు
రణవీరుల ఉదయాలు పాడుతూ,
అణగారిన బతుకులకు
ఆత్మవిశ్వాసం నేర్పిన స్వరం నీవు.
దండెత్తిన డప్పు చప్పుళ్లు నీవు,
దళితుడి కన్నీటి ప్రతిధ్వని నీవు.
కూలీ చెమటకు విలువ చెప్పిన
కష్టజీవి గుండె చప్పుడు నీవు.
యమకింకారుల బెదిరింపులకు
ఉద్యమ గీతిక రుచి చూపించి,
అన్యాయపు గోడలను
పాటతోనే పగులగొట్టిన
ప్రజా గాయని నీవు.
నీ పాట వినిపిస్తే
పోరాటం పుడుతుంది.
నీ మాట వినిపిస్తే
ధైర్యం మొలుస్తుంది.
నీ అడుగు పడితే
ఉద్యమం ఊపిరి పీలుస్తుంది.
విమలక్క…
నీ గానం ప్రజల ప్రాణం,
నీ పోరాటం తెలంగాణ గౌరవం.
నీకు లాల్ సలాం!
నీకు నిల్ సలాం!
నీ ఉద్యమానికి పోరు సలాం!
నీ పాటకు శతకోటి సలాం!..
పాటల పెద్దక్క తెలంగాణ గానకోకిల..
అరుణోదయ విమలక్క కి పుట్టిన రోజూ శుభాకాంక్షల తొ…..
అందె డప్పు భాస్కర్ ఉస్తాద్



