తన ప్రపంచంలో లేని..
అద్భుతమైన ప్రపంచాన్ని
చూపించే కలల రాజు..
అతని అందం..
అద్దంలో కనిపించే ముఖంలో కాదు
ఆపదలో ముందుండే ధైర్యం లో ఉంటుంది..
అతని ప్రేమ.
ప్రతిరోజు ప్రేమిస్తున్న అని చెప్పే మాటల్లో కాదు
నువ్వు నాకోసం అని తన కళ్ళల్లో
దాచుకునే మౌనంలో ఉంటుంది.
అతని హుందాతనం
గంభీరంగా మాట్లాడటంలో కాదు..
గౌరవంగా వినడంలో ఉంటుంది.
అతని మగతనం
ఎవరినో జయించడం లో కాదు..
తన కోపాన్ని జయించి తన వాళ్లను
కాపాడుకోవడంలో ఉంటుంది.
అతని అంకిత భావం..
ఒక రోజులో కనిపించదు
కాలం గడిచే కొద్ది మారకుండా
నిలిచే నీడలా ఉంటుంది..
అతను పూలు ఇవ్వకపోవచ్చు
కానీ నీ జీవితం అనే పయనంలో
ముళ్ళు గుచ్చుకోకుండా అడుగడుగునా
దారి శుభ్రం చేస్తాడు.. అందుకే
అందమైన అబ్బాయిని కాదు
అందంగా ప్రేమించగల
అబ్బాయిని వెతుకు ఎందుకంటే
రూపం కాలంతో మారిపోతుంది
కానీ నిజమైన ప్రేమ కాలాన్నే మార్చే శక్తి
కలిగి ఉంటుంది..
- సుధేష్ణా దేవి జంగంగారి, 9177938246
అతను
- Advertisement -
- Advertisement -



