- Advertisement -
ఆనాటి ఉపాధ్యాయుడికి
అలనాటి విద్యార్థుల
పూర్వ విద్యార్థుల సమ్మేళన ఆహ్వానం
తెచ్చేను నూతనోత్సాహం
సమ్మేళన వేళ విద్యార్థుల
ఆత్మీయ పలకరింపులు
యోగక్షేమాల పరామర్శలు
జరిపిన సన్మాన సత్కారాలు
బడిలో వసతులే లేని వేళ
చేసిన నిస్వార్థ సేవా త్యాగాలకు
కాలం తెచ్చిన ఈ పూర్వ విద్యార్థుల
అపూర్వ సమ్మేళనాలు
గురువుల హృదయాలకు
ఇచ్చేను కొండంత బలం
మరువలేని వన్నె తెచ్చేను
ఉపాధ్యాయ వృత్తికి గౌరవం
డా మైలవరం చంద్ర శేఖర్
- Advertisement -



