- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :రుణాల వసూళ్లలో బ్యాంకులు, రికవరీ ఏజెన్సీలు అనుసరించాల్సిన కొత్త మార్గదర్శకాలను RBI విడుదల చేసింది. పర్సనల్, వెహికల్, హోమ్ తదితర రుణాల చెల్లింపులో విఫలమైన కస్టమర్ల మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్లను లాక్ చేయడం లేదా వాటి సేవలను నిలిపివేయడం ఇకపై అనుమతించబోదని స్పష్టం చేసింది. అయితే అదే పరికరాలను బ్యాంకు రుణంతో కొనుగోలు చేసినట్లయితే, రుణ వసూలుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత మాత్రమే వాటిని డిజేబుల్ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అత్యవసర కాల్స్, ఎస్ఎంఎస్, SOS వంటి సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదని ఆదేశించింది.
- Advertisement -



