- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్‌లోని నొంతగురి ప్రావిన్స్‌లో డెబ్సిరిన్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో సమీపంలోని రెండు పాఠశాలలను మూసివేశారు. థాయ్ ఉప ప్రధాని అనుతిన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -



