- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ పథకం ద్వారా హైదరాబాద్లో సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తోంది. కేవలం ఆరు లక్షల రూపాయలకే అందమైన ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ లోపల నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు మాత్రమే అవకాశం ఉంది. గడువు పొడిగింపు ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మీసేవా కేంద్రం, ఆన్లైన్ పోర్టల్ లేదా వాట్సాప్ (8096958096) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- Advertisement -



