తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

– పెద్దపల్లి జిల్లా రామగిరిలో ఘటన
నవతెలంగాణ – రామగిరి
ప్రమదవశాత్తు తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారం జరిగింది. రత్నాపూర్‌ గ్రామానికి చెందిన గీత కార్మికుడు ముక్కెర లక్ష్మణ్‌ గౌడ్‌ చెట్టు ఎక్కి తాటి కల్లు గిస్తుండగా మోకు జారీ చెట్టు పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయలవగా ఆ పక్కనే ఉన్న గీత కార్మికులు గమనించి హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ పల్లె ప్రతిమ పీవీరావు, ఎంపీటీసీ ధర్ముల రాజసంపాత్‌, ఉప సర్పంచ్‌ దుబ్బాక సత్య రెడ్డి కోరారు.

Spread the love