- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో నిర్మించిన రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ ఆరు నెలలు పూర్తికాకముందే కుంగిపోవడం కలకలం రేపింది. రూ.64 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. అయితే భారీ వర్షాల ప్రభావంతో ఆగస్టులో బ్రిడ్జ్ ఒకవైపు కుంగిపోయి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారుల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిర్మాణ నాణ్యతపై స్థానికులు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజా ధనంతో నిర్మించిన వంతెన ఇంత తక్కువ సమయంలోనే దెబ్బతినడంపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
- Advertisement -



