- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ చిత్రబృందం ప్రత్యేక అప్డేట్ ఇచ్చింది. సినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్ ప్రమోషన్ పేజ్ ‘X’లో ఈ ఫొటోలను షేర్ చేయగా.. చిత్రబృందం వాటిని రీపోస్ట్ చేసింది. ఈ స్టిల్స్‌లో మహేశ్ స్టైలిష్, హ్యాండ్సమ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇవి ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఫ్రేమ్స్ అని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు.


- Advertisement -



