Sunday, August 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మరిన్ని విజయాలు సాధించాలి

మరిన్ని విజయాలు సాధించాలి

- Advertisement -

రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

నవతెలంగాణ దినపత్రిక పదకొండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాత్రికేయులకు, సిబ్బందికి, పాఠకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి నిర్మాణాత్మకంగా తోడ్పడటంలో నవతెలంగాణ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నది. ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొంటూ, జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తూ నవతెలంగాణ మరిన్ని విజయాలను సాధించాలి. తెలంగాణ ప్రజల ఆదరణతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -