– క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
– సంగారెడ్డిలో 2k రన్ ప్రారంభంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : బీజేపీ కార్పోరేట్ అనుకూల రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా “ఆగస్టు 10న జరిగే జైల్ భరో” ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో సీఐటీయూ యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న జరిగే జైల్ భరో జయప్రదానికై 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుక్క రాములు హాజరైనారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దా మని, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని సంపదను సార్వభౌమత్వాన్ని విదేశీ సంస్థలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన దుయ్యబట్టారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు పోరాడాలని అన్నారు. అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికులకు కార్మిక చట్టాలను ఒక్క కలం తోనే 29 చట్టాలను రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు కోడ్స్ గా తీసుకురావడం అంటే కార్మికులు వారి మౌలిక హక్కులను పూర్తిగా హరించడమే అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు సంఘటిత అసంఘటిత కార్మికులకు నష్టం వాటి విధానాలని అవలంబిస్తున్న బిజెపి మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణకు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ప్రజలు పెద్ద ఎత్తున బిజెపి పాలనకు చరమగీతం పాడితే తప్ప ఈ విధానాలను తిప్పి కొట్టలేమన్నారు. అందుకోసం ఆగస్టు 10న జరగనున్న జైలు భరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు, సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు, తది తరులు పాల్గొన్నారు.
‘జైల్ భరో’ను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



