- Advertisement -
కాలు బొటనవేలి గాయంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ స్థానంలో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుండగా.. శుభ్‌మన్ గిల్ సేన కొలంబో నుంచి గాలెకు బయల్దేరడానికి ముందే జట్టుతో సర్ఫరాజ్ ఖాన్ చేరనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 6 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 371 పరుగులు చేయగా.. అత్యధిక స్కోరు 150. స్వదేశంలో 2024లో న్యూజిలాండ్‌పై సర్ఫరాజ్ ఖాన్ ఆఖరు టెస్టు ఆడాడు.
- Advertisement -



