ఫైనల్లో చైనా షట్లర్‌పై గెలుపు
కొరియా మాస్టర్స్ సూపర్ 300
సియోల్ (దక్షిణ కొరియా)
కొరియా మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ అస్మిత చాలిహ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాల్గో సీడ్ చైనా షట్లర్ హన్ క్వియాన్ షిపై మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందిన అస్మిత చాలిహ.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచింది. 26 ఏండ్ల అస్మిత చాలిహ తొలి గేమ్‌లో 14-21తో నిరాశపరిచింది. కానీ, ఆ తర్వాత వరుస గేముల్లో రెచ్చిపోయింది. 21-14, 21-14తో 53 నిమిషాల మ్యాచ్‌లో చైనా షట్లర్‌ను చిత్తు చేసింది. ‘కొరియా ఓపెన్ విజేతగా నిలువటం గొప్పగా ఉంది. విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. మరిన్ని టైటిల్స్ సాధించాలనే తపన పెరిగింది’ అని విజయానంతరం అస్మిత చాలిహ తెలిపింది.



