తెలంగాణా మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా శనివారం రోజు కొత్త సినిమా ప్రారంభమైంది. యం.యస్ వారాహి క్రియేషన్స్ , శివమ్ మీడియా పతాకంపై ప్రొడ క్షన్ నెం.3గా ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దిలీప్ సాయి నాయక్. మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో చిత్రం వైభవంగా ప్రారంభమైంది. దర్శకుడు దిలీప్‌కి స్క్రిప్ట్‌ని సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ అందించగా, హీరో కిట్టుపై చంద్ర బోస్ క్లాప్ నిచ్చారు. ఆర్ పి పట్నా యక్ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా, బిగ్ టీవి విజయ్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసి టీమ్‌కి అభినం దనలు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ,‘ఈ టీమ్ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎంతో టాలెంట్ ఉన్న వారు. నిర్మాతలు ముని శివ, శివ మల్లాల, బుల్లెట్‌బండి లక్ష్మణ్, సంగీత దర్శకుడు మదిన్ నాకు ఎంతో ఆత్మీయులు. వారందరూ పెద్ద విజయం సాధించాలని కోరు కుంటున్నా’ అని అన్నారు.
‘మంచికథతో వచ్చిన దర్శకుడు దిలీప్‌కి మా శివలిద్దరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు’ అని సతీష్ వేగేశ్న చెప్పారు.ఆర్‌పి పట్నాయక్ మాట్లాడుతూ,‘ఈ నిర్మాతలిద్దరూ మంచి సినిమాలు చేసి పెద్ద నిర్మాతలుగా మారి పదుల కొద్ది సినిమాలు తీయాలి’ అని తెలిపారు. ‘నేను చాలా చిన్న నటునిగా ఫోక్ సాంగ్స్ చేసేవాడిని. అలాంటిది నేను చేస్తున్న ఈ సినిమాకి ఇంత పెద్దవాళ్లు వచ్చి సపోర్టు చేయటం ఎంతో ఆనందంగా ఉంది’ అని హీరో కిట్టు అన్నారు. సంగీత దర్శకుడు మదిన్, కెమెరా మెన్ జనతా బబ్లూ, నూతన దర్శ కుడు కృష్ణకాంత్, ఫోక్ ఇండస్ట్రీ నుండి అనేకమంది కళాకారులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఆడిటర్ విజయ్ రెడ్డి , సంగీత దర్శకుడు మౌళి తది తరులు పాల్గొన్నారు.
ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా షురూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



