Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథ

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథ

- Advertisement -

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు శ్రీకర్ . మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఈ సినిమాలోని ‘స్కూల్ సాంగ్..’ని రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ,‘ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. పిల్లలతో పాటు తల్లిదండ్రులు అంతా చూడాల్సిన చిత్రమిది. బ్యూటిఫుల్ ఎమోషన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. ‘పిల్లలతో ఒక పూర్తి పాట పాడించాలనేది నా డ్రీమ్. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. సింగర్ విశ్వదత్తా ఈ పాటను ఎంతో అందంగా పాడాడు. జి సరిగమపా విన్నర్ ఆ అబ్బాయి. అతనికి తొలి పాట ఇది. ఈ పాటకు కొరియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సందీప్ మంచి హుక్ స్టెప్స్ ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది’ అని మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి చెప్పారు. సింగర్ విశ్వదత్తా మాట్లాడుతూ,‘ఈ సాంగ్ పాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈపాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ‘పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకునేలా మా మూవీ త్వరలోనే మీ ముందుకు వస్తుంది’ అని డైరెక్టర్ శ్రీకర్ చెప్పారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,‘ఈ వేదిక మీద పిల్లలంతా స్కూల్ సాంగ్ కు మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. యూట్యూబ్ లో నాకు బాగా నచ్చిన పాపులర్ అయిన ఒక పాట రిఫరెన్స్ చెప్పి సింజిత్ ను సాంగ్ చేయమన్నాను. అతను ఆ పాట ఎనర్జీని మ్యాచ్ చేసేలా బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ తో చేసిన పాటను సందీప్ మాస్టర్ సూపర్బ్ స్టెప్స్ తో మరింత అందంగా తయారుచేశారు’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -