Monday, August 10, 2026
E-PAPER
Homeఆటలుఆరుశ్‌ దాస్‌కు కాంస్యం

ఆరుశ్‌ దాస్‌కు కాంస్యం

- Advertisement -

జాతీయ సబ్‌జూనియర్‌ 
స్విమ్మింగ్‌ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
42వ జాతీయ సబ్‌ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్స్‌ పోటీలలో తెలంగాణ యువ స్విమ్మర్‌ ఆరుశ్‌ దాస్‌ సత్తా చాటాడు. జైపూర్‌లో ఆదివారం జరిగిన బాయ్స్‌ 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైన్లలో ఆరుశ్‌ దాస్‌ ఆకట్టుకున్నాడు. 29.44 సెకండ్లతో ఆరుశ్‌ దాస్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. మధ్యప్రదేశ్‌, కర్నాటక స్విమ్మర్లు పసిడి, రజత పతకాలు దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో తొలి పతక ప్రదర్శన చేసిన ఆరుశ్ దాస్‌ను తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం, క్రీడా ప్రాధికార సంస్థ, స్విమ్మింగ్‌ కోచ్‌ ఆయుశ్‌ యాదవ్‌లు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -