Monday, August 10, 2026
E-PAPER
Homeజాతీయంఆరుగురు ఎంపీల విలీనం..రెండు వారాలకు కేసు వాయిదా

ఆరుగురు ఎంపీల విలీనం..రెండు వారాలకు కేసు వాయిదా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: శివసేన(యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో విలీనమైన విషయం తెలిసిందే. సదురు ఎంపీల విలినాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కేసును సోమవారం రెండు వారాల పాటు ధర్మాసనం వాయిదా వేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, జాయింట్ సెక్రటరీ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడాన్ని గమనించిన ధర్మాసనం ఈ విషయాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసింది.

కాగా,పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు, జూలై 18న, శివసేన (UBT)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. దీంతో లోక్‌సభలో శివసేన (UBT)కు ఇప్పుడు ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. సంజయ్ జాదవ్, సంజయ్ పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, ఓంరాజే నింబాల్కర్, నాగేశ్ పాటిల్ అష్టికర్, భాసాహెబ్ వాక్‌చౌరే అనే ఆరుగురు రెబల్ ఎంపీలు శివసేనలో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -