Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లిలో ఉద్రిక్తంగా 'జైల్ భరో'

సత్తుపల్లిలో ఉద్రిక్తంగా ‘జైల్ భరో’

- Advertisement -

– ప్రజాసంఘాల నాయకుల అరెస్ట్
– ఇక జరిగే ఉద్యమాలన్నీ క్విట్ ఇండియా స్ఫూర్తితోనే 
– సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘ నాయకులు మోరంపూడి, జాజిరి, కొలికపోగు
నవతెలంగాణ : సత్తుపల్లి

సత్తుపల్లిలో సోమవారం జరిగిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. జైల్ భరో కార్యక్రమానికి నాయకత్వం వహించిన సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ‘జైల్ భరో’ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాండురంగారావు, శ్రీనివాస్, సర్వేశ్వరరావు, మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఇకనుంచి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు జరుగుతాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతూ,  కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తూ కాషాయ పాలన సాగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం  వహిస్తున్నాయని మండిపడ్డారు.

పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్‌లుగా మార్చడాన్ని తీవ్రంగా నిరసించారు. పని వేళలను 8 గంటల నుండి 12 గంటలకు పెంచడం, ‘హైర్ అండ్ ఫైర్’ విధానాలను ప్రోత్సహించడం దారుణమన్నారు. కార్మికులకు రూ. 31వేలు  కనీస వేతనం చెల్లించాలని, స్కీమ్ వర్కర్లకు రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు-2025ను ఉపసంహరించుకోవాలని, పంటలకు మద్దతు ధరతో పాటు ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పాటు పని కల్పించి, రోజుకూలీ రూ. 700 చెల్లించాలని కోరారు. 

అరెస్టైన ప్రజాసంఘాల నాయకులు వీరే 
‘జైల్ భరో’ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ప్రజాసంఘాల నాయకులు పోలీసులు అడ్డుకునే అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, కొలికకపోగు సర్వేశ్వరరావు, జాజిరి జ్యోతి, మోరంపూడి వెంకటరావు, చావా రమేష్, తడికమళ్ల రామకృష్ణ, బీకే  ప్రసాద్, నాగేంద్ర, రఫీ ఉన్నారు. లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకునే వరకు పోరాటాలు ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -