- Advertisement -
మద్నూర్ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ
నవతెలంగాణ-మద్నూర్
ఈనెల 16న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కూతురు జోనిట పెండ్లి విందు కార్యక్రమం కందరుపల్లి సమీపంలోని డి బి ఎల్ స్థలంలో జరగనుంది. ఈ సందర్భంగా సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీంకాంతారావు కూతురు వివాహ వేడుకకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కోరారు. వేడుకలో ఏర్పాటుచేయనున్న విందును స్వీకరించాలని చెప్పారు.
- Advertisement -



