Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మంసెమిస్టర్ పరీక్షా ఫలితాలలో ‘మిస్ట్’ విద్యార్థుల ప్రతిభ

సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో ‘మిస్ట్’ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

– అభినందించిన ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ 
నవతెలంగాణ – సత్తుపల్లి

2025-2026 విద్యా సంవత్సరం గత జూన్ నెలలో మదర్ థెరెసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (అటానమస్) హోదాలో నిర్వహించిన బీటెక్ ద్వితీయ సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ బ్రాంచ్‌లలో అత్యుత్తమ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (ఎస్జీపీఏ) సాధించిన విద్యార్థుల వివరాలను ఆయన ఈ క్రింది విధంగా వెల్లడించారు. ఈఈఈ విభాగంలో ఎం.  సామ్రాహ మహేక్ 10/10 సాధించగా, ఎన్. లింగేశ్వరి 9.9, ఎ. భావనశ్రీ 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించారని ఆయన తెలిపారు.

ఈసీఈ బ్రాంచ్‌లో ఎన్. రమ్య 9.35, వి. హేమని 9.35, కె. మల్లేశ్వరి 9.2, ఎం. నాగ జ్యోత్స్న 9.2, షేక్. ఇజాజ్ 9.2, ఎస్. అమృత వర్షిని 9.2, టి. జ్యోతి 9.15 పాయింట్లు చొప్పున పొందారు. సీఎస్ఈ బ్రాంచ్ నుంచి ఎ. సత్యశ్రీ 9.15, ఎం. ప్రవళిక 8.95, ఎన్. హర్షిత 8.95 సాధించారు.  ఏఐఅండ్ఎంఎల్ విభాగం నుంచి పి. పల్లవి 9.15, ఎస్. అఖిల 9.00 సాధించగా, సివిల్ నుంచి పి. శృతి 8.8 జయకేతనం ఎగురవేశారు. అన్ని విభాగాల నుంచి మొత్తం మీద ఒక విద్యార్థి 10 గ్రేడ్ పాయింట్లు, 17 మంది విద్యార్థులు 9.0 గ్రేడ్

పాయింట్లు, అలాగే 70 మంది విద్యార్థులు 8.0 గ్రేడ్ పాయింట్లు సాధించి కళాశాల కీర్తిని పెంచారని ప్రిన్సిపాల్ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ, మదర్ థెరెసా విద్యాసంస్థల ప్రెసిడెంట్  చలసాని సాంబశివరావు అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూఏసీ  కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీ రామచంద్రరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎల్. సాయి ఇంద్రసేనారెడ్డి, పలు విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -